అరుదైన గాంధీ చిత్రం వేలం
పెన్సిల్‌తో గీసిన మహాత్మాగాంధీజీ చిత్తరవుతో పాటు ఆయన స్వయంగా రాసిన కొన్ని ఉత్తరాలను జులై 11న లండన్‌లో వేలం వేయనున్నారు. గాంధీ చిత్తరువు రూ.6.72-10 లక్షలు, ఉత్తరాలు రూ.19.32-27.72 లక్షల ధర పలకవచ్చని వీటిని వేలం వేస్తున్న సోథెబ్లేసు అనే సంస్థ అంచనా వేస్తోంది. 1931లో రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొనడానికి గాంధీజీ లండన్ వెళ్లినప్పుడు జాన్హెన్నీ ఆమిషివిట్జ్ అనే వ్యక్తి పెన్సిల్ తో ఈ చిత్రం గీశాడు. స్వాతంత్య్ర సంగ్రామం సమయంలో ఆజాద్ హింద్‌ఫౌజ్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రబోసు సోదరుడు శరత్బోసుకు మహాత్ముడు ఉత్తరాలు రాశారు. వీటిలో బెంగాల్ విభజన, కమ్యూనిస్టు పాలనపై గాంధీజీ తన అభిప్రాయాలను వెల్లడించారు.













