పద్మావతీ అమ్మవారికి లగడపాటి కానుక
తిరుచానూరులో కొలువై ఉన్న శ్రీ పద్మావతీ అమ్మవారికి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ లక్ష్మీహారాన్ని కానుకగా అందజేశారు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్న లగడపాటి మొక్కులు చెల్లించుకునే క్రమంలో ప్రత్యేకంగా తయారు చేయించిన రూ.7.74 లక్షల విలువ గల లక్ష్మీహారాన్ని అమ్మవారికికి కానుగా సమర్పించారు. మంచి ముత్యాలు, కెంపుల, పచ్చలు, పగడాలను బంగారంలో పొదిగి 235 గ్రామలు బంగారంతో ప్రత్యేకంగా తయారు చేయించిన హారాన్ని రాజగోపాల్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో మునిరత్నంరెడ్డికి అందజేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు బాబూస్వామి వారికి పూలు, కుంకుమ అందజేశారు.













