అమిత్ షాపై అమెరికా ఆంక్షలు !
అమెరికాకు చెందిన కమిషన్ ఆన్ ఇంటర్నెషనల్ రిలీజియస్ ఫ్రీడమ్.. వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుపై స్పందించింది. ఈ బిల్లు తప్పుడు దిశలో వెళ్తున్న ప్రమాదకరమైన మలుపుగా అభివర్ణించింది. బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి అమిత్ షాపై ఆంక్షలు విధించే ఆలోచనలో అమెరికా కమిషన్ ఉన్నట్లు తెలుస్తోంది. పౌరసత్వ సవరణ బిల్లు కేవలం మతం ఆధారంగా శరణార్థులకు రక్షణ కల్పించేదిగా ఉన్నట్లు అమెరికా కమిషన్ అభిప్రాయపడింది. శరణార్థుల్లో ముస్లింలు కాని వారికి భరోసా ఇవ్వడం సరిగా లేదని యూఎస్సీఐఆర్ఎఫ్ ఒక ప్రకటనలో పేర్కొన్నది. మతం ఆధారంగా పౌరసత్వం కల్పించినట్లుగా బిల్లు ఉందని ఆ కమిషన్ పేర్కొన్నది. లోక్సభలో బిల్లు పాక్ కావడం పట్ల యూఎస్సీఆర్ఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఒక వేళ ఉభయసభల్లో పౌరసత్వా సవరణ బిల్లు పాసైతే, అప్పుడు హోంమంత్రి అమిత్ షాతో పాటు ఇతర ప్రధాన నేతలపై ఆంక్షలు విధించాలని అమెరికా కమిషన్ సూచించింది.













