ఆర్కేనగర్లో దినకరన్ విజయం
ఆర్కేనగర్ అసెంబ్లీ ఉపఎన్నికలో ఇండిపెండెంట్ అభ్యర్థి టీటీవీ దినకరన్ ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదన్‌పై 40,707 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. డీఎంకే మూడో స్థానంలో నిలిచింది. మొత్తం పోలైన ఓట్లలో 89,013 ఓట్లు దినకరన్‌కు, అన్నా డీఎంకే మధుసూదన్‌కు 48,306 ఓట్లు, డీఎంకేకు 24,651, నామ్ తమిళర్ కట్చికి 3,860, నోటాకు 2,373, భాజపాకు 1,417 ఓట్లు ఓట్లు లభించాయి. 2016లో జయలలిత సాధించిన 39,545 ఓట్ల మెజార్టీని దినకరన్ అధిగమించారు. దినకరన్ గెలుపుతో దినకరన్ అనుచరులు తమిళనాడులో సంబారాలు జరుపుకుంటున్నారు.













