బెదరింపులకు లొంగం – డీకె
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సారథ్యంలోని కాంగ్రెస్-జీడేఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో బలపరీక్షలో నెగ్గడంతో ఉభయపార్టీలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి. ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గిన అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ ఆడమన్నట్టల్లా తాము ఆడే ప్రసక్తే లేదని చెప్పారు. ప్రభుత్వం 24 గంటల్లోగా రైతు రుణాలు మాఫీ చేయకపోతే ఈనెల 28న రాష్ట్ర వ్యాప్త బంద్ చేపడతామని బీజేపీ హెచ్చరించడంపై ఆయన మండిపడ్డారు. ‘వారు (బీజేపీ) మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయలేరు. మేము బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా వ్యవహరిస్తాం. బీజేపీ ఆడమన్నట్టల్లా ఆడం’ అని తేల్చిచెప్పారు.













