టీడీపీతో పొత్తు శుభ సంకేతం : మెయిలీ
ఎన్డీఏపై ప్రతిపక్షాల ఉమ్మడి పోరు కోసం యూపీఏ లోకి వస్తే టీడీపీకి స్వాగతం పలుకుతామని కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్పై పోరాటానికి కాంగ్రెస్, సీపీఐలతో కలిసి టీడీపీ మహాకూటమిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కాంగ్రెస్ ఇన్చార్జిగా పనిచేసిన మొయిలీ ఈ విషయమై మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు శుభ సంకేతమని, కాంగ్రెస్‌కు మేలు చేకూరుతుందని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతే తెలియని వ్యక్తి అని విరుచుకుపడ్డారు.













