రెండు స్థానాల్లో పోటీ చేయకూడదు
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఏకకాలంలో రెండు నియోజకవర్గాల నుంచి పోటీచేయకూడదని ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకి తెలిపింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 33(7) సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై కోర్టులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇసి ఈ విషయాన్ని సృష్టం చేసింది. అయితే దీన్ని రద్దు చేయాలని కోరుతూ అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తి పిటిషన్ వేశారు. దీనిపై విచారణకు సంబంధించి అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ సహకారాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఖన్వి లోకర్, జస్టిస్ డివై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం కోరింది.













