2020 కేంద్ర బడ్జెట్లోని ముఖ్యాంశాలు…
బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. రూ.1.3 లక్షల కోట్లతో మౌలిక రంగ ప్రాజెక్టులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి మొదటి ప్రాధాన్య అంశంగా ప్రకటించారు. ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీటికి ద్వితీయ ప్రాధాన్యం, విద్య, చిన్నారుల సంక్షేమానికి మూడో ప్రాధాన్యం కల్పించారు.
బడ్డెట్‌లోని ముఖ్యంశాలు…
విద్యారంగానికి రూ.99,300 కోట్లు.
ఆరోగ్య రంగానికి రూ.69 వేల కోట్లు.
జౌళి రంగానికి రూ.1,480 కోట్లు.
ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకానికి రూ.6,400 కోట్లు.
జల్ జీవన్ మిషన్‌కు రూ.11,500 కోట్లు.
స్వచ్ఛభారత్ మిషన్‌కు రూ.12,300 కోట్లు.
పౌష్టికాహార పథకం కోసం రూ.35,600 కోట్లు.
నేషనల్ మిషన్ ఫర్ క్యాంటమ్ టెక్నాలజీస్‌కు రూ.8వేల కోట్లు.
భారత్ నెట్ పథకానికి రూ.6 వేల కోట్లు.
రవాణా, మౌలిక సదుపాయాల అభివృద్దికి రూ.1.7 లక్షల కోట్లు.
బెంగళూరు నగరానికి రూ.18,600 కోట్లతో మెట్రో తరహా సబర్బన్ రైల్వే పథకం.
నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు రూ.3 వేల కోట్లు.
మహిళలు, శిశువులకు పౌష్టికాహారం అందించేందుకు రూ.28,600 కోట్లు.
గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాగునీరు, అనుబంధ రంగాలకు రూ.2.83 లక్షల కోట్లు.
నగరాల్లో కాలుష్య నియంత్రణకు రూ.4,400 కోట్లు.
పర్యాటక రంగ అభివృద్ధికి రూ.2వేల కోట్లు.
సీనియర్ సిటిజన్లు, దివ్వాంగుల కోసం రూ.9,500 కోట్లు.
ఎస్టీల కోసం రూ.53 వేల కోట్లు.
ఎస్సీలు, ఓబీసీలకు రూ.85 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.













