48 గంటలపాటు నిరవధిక సమ్మె
ఈ నెల 30, 31 తేదీల్లో దేశంలోని అన్ని బ్యాంకు ఉద్యోగ సంఘాలు 48 గంటలపాటు నిరవధిక సమ్మెకు దిగుతున్నాయని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ విజయవాడ యూనిట్ నేతలు తెలిపారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేతలు మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలు ఉద్యోగులపై విభజించు, పాలించు అనే పద్ధతిలో కొనసాగుతున్నాయన్నారు. తమ న్యాయమైన సమస్యలపై ఉద్యోగులను విభజించి చేస్తున్న పే సెటిల్మెంట్కు మేము వ్యతిరేకం అని, కమిటీ నివేదికలు ఉద్యోగులకు వేజ్ రివిజన్ 2 శాతం మాత్రమే చేశారని, 15 శాతం పే రివిజన్ చేయాల్సి ఉన్నా బ్యాంకర్ల పరిస్థితి బాగోలేదని చెబుతున్నారని వారు పేర్కొన్నారు. నీరవ్ మోడీ, విజయ్ మాల్యా వంటి వాళ్లు ఎగ్గొట్టిన రుణాలను మినహాయించగా బ్యాంక్‌కు వచ్చిన లాభాల్లో 2శాతం పెంచుతామనడం సిగ్గు చేటని, ఒక్క నీరవ్ మోడీ వలన 11 వేల కోట్ల ఫైగా ఆ బ్యాంక్ నష్టపోయిందని తెలిపారు.













