వెంకయ్యను కలిసిన తెలుగు రాష్ట్రాల ఎంపీలు
ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య నాయుడుతో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అన్ని పార్టీల ఎంపీలు ఆయన నివాసంలో కలిసి అభినందనలు తెలిపారు. ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యను అన్ని పార్టీల ఎంపీలు మద్దతు తెలిపారు. తెలుగుదేశం, టీఆర్ఎస్, బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్టీలకతీతంగా ఆయన నివాసానికి చేరుకుని మద్దతు తెలిపారు. ఈ నెల 5న జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే విధానంపై ఎంపీలకు వెంకయ్య అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు బండారు దత్త్తాత్రేయ, అశోక్ గజపతి రాజు పాల్గొన్నారు.













