అందుబాటులోకి కరోనా యాప్
కరోనా వైరస్ రోగులను గుర్తించేలా కోవిడ్-19 ట్రాకింగ్ యాప్ ఆరోగ్య సేతు పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ యాప్ స్మార్ట్‌ఫోన్ లొకేషన్ డేటా, బ్లూటూత్ ద్వారా కోవిడ్ సోకిన వ్యక్తి సమీపంలో యూజర్ ఉన్నాడా లేదా అని యాప్ చెబుతుంది. కరోనా రోగితో ఎవరైనా కాంటాక్ట్ లోకి వస్తే.. వారి డేటాను ఈ యాప్ ప్రభుత్వానికి అందజేస్తుంది. యాప్ ప్రైవసీ పాలసీ ప్రకారం యూజర్ల డేటాను బయటి వారితో ఈ యాప్ పంచుకోదు. కేవలం ప్రభుత్వానికి మాత్రమే మీ వివరాలను షేర్ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పేరు, ఫోన్ నంబర్ లాంటి వివరాలు బయటకు రావని ధికారులు వెల్లడించారు.
ఆరోగ్య సేతు యాప్‌లో రాష్ట్రాల వారీగా కరోనావైరస్ హెల్ప్లైన్ల సమచారాన్ని పొందుపరిచారు. ఈ యాప్ వాడాలనుకునే వారు తమ ఫోన్ నంబర్ సాయంతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ ఆండ్రాయిడ్‌తో పాటు ఐఓఎస్ లోనూ అందుబాటులో ఉంది. 11 భాషల్లో కరోనా గురించిన సమాచారాన్ని ఈ యాప్ ద్వారా పొందొచ్చని పేర్కొన్నారు.













