ట్రంప్ కార్యవర్గంలో తులసీ గబ్బార్డ్ కు చోటు…
అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్.. తన కార్యవర్గ ఎంపిలో దూసుకుపోతున్నారు. కేబినెట్ పదవుల్లో కీలక వ్యక్తులకు అవకాశం కల్పిస్తున్నారు. తనకు మద్దతుగా వెన్నంటి నిలిచిన తులసి గబ్బర్డ్(Tulsi Gabbard) ను అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా నియమించారు. ఈ తరుణంలో ]తులసీ గబ్బర్డ్‌కు సంబంధించిన వీడియో ఒకటి ఎక్స్‌లో వైరల్ అవుతోంది. గంథెర్ ఈగల్మేన్ అనే ట్విటర్ ఖాతాలోదిసీజ్ తులసి గబ్బర్డ్ అనే వీడియో షేర్ అయింది. ఇప్పటికే 20 లక్షలకు పైగా వ్యూస్‌ను దక్కించుకుంది.
తులసి గబ్బర్డ్ ఎంపిక తరువాత ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె ఒక గర్వించదగిన రిపబ్లికన్ అని అభివర్ణించారు.అయితే తులసి గబ్బర్డ్ హిందువు కావడంతో ఆమె ఎంపిక ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంది. చాలామంది ఊహించుకున్నట్టుగా ఆమె భారత సంతతికి చెందిన మహిళ కాదు. కానీ హిందువుమాత్రమే. తులసి గబ్బర్డ్. తులసి తల్లి హిందూ మతాన్ని స్వీకరించిన నేపథ్యంలో ఆమె తన పిల్లలకు హిందూ పేర్లు పెట్టారు. భక్తి, జై, ఆర్యన్, బృందావన్ అనే హిందూ పేర్లు పెట్టింది తులసి తల్లి.
తులసి భర్త అబ్రహం విలియమ్స్ ( Abraham Williams) కూడా ఇస్కాన్ ను అనుసరిస్తారు 2013 నుంచి 2021 వరకు హవాయి పార్లమెంటు సభ్యురాలిగా ఉన్నారు తులసీ. దాదాపు రెండు దశాబ్దాలు అమెరికా ఆర్మీ నేషనల్ గార్డ్‌లో సేవలందించారు. ఆమెకు నిఘా విభాగంలో పనిచేసిన అనుభవం లేదు కానీ హోంల్యాండ్ సెక్యూరిటీ కమిటీలో పనిచేశారు. ఇరాక్, కువైట్‌లోనూ పని చేశారు. గతంలో పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసే సమయంలో భగవద్గీతపై చేయి వేసి ప్రమాణం చేయడం విశేషంగా నిలిచింది.






