Bangladesh: రాష్ట్రపతిగా మాజీ ప్రధాని..?
దాదాపు రెండేళ్ళ నుంచి అల్లకల్లోలంగా ఉన్న బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నారు. ఇటీవల బంగ్లాదేశ్ ఎన్నికలు ఆ దేశ ముఖ చిత్రాన్ని మార్చే అవకాశం ఉందనే సంకేతాలు వచ్చాయి. మహిళా ప్రధానులను చూసిన బంగ్లా ప్రజలు ఇప్పుడు.. పురుష ప్రధాని పదవిని చూడనున్నారు. ఈ క్రమంలో మరికొన్ని కీలక అడుగులు పడే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన తారిఖ్ రెహమాన్(Tariq Rahaman) ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు.
ఇక అక్కడి నుంచి బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఎవరు అనే ప్రశ్న తలెత్తుతుంది. తారిఖ్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) ముహమ్మద్ యూనస్‌ను అత్యున్నత పదవికి నామినేట్ చేస్తుందా అనేది పెద్ద ప్రశ్న. యూనస్ తాత్కాలిక ప్రభుత్వంలో జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఎ) అయిన ఖలీలుర్ రెహమాన్, బిఎన్‌పి నేతృత్వంలోని ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా చేరారు. దీనితో మహ్మద్ యూనస్ కు, తారిక్ కు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయనే అభిప్రాయాలు వినపడుతున్నాయి.
తారిక్ రెహమాన్ మంత్రివర్గ జాబితాలో లేని బిఎన్‌పి సీనియర్ నేత, ఖండకర్ మోషారఫ్ హుస్సేన్ పేరు చర్చనీయాంశమవుతున్నప్పటికీ, యూనస్ ను మాత్రం దాదాపుగా ఎంపిక చేసే అవకాశం కనపడుతోంది. యూనస్‌కు పశ్చిమ రాష్ట్రాలతో లోతైన సంబంధాలు ఉన్నాయి. ఇది ప్రస్తుత ప్రభుత్వానికి కలిసి వచ్చే అవకాశం ఉంది. తారిక్ ఇప్పుడు మహ్మద్ యూనస్ ను అధ్యక్షుడిగా నియమిస్తే.. మాజీ ప్రధానితో అంత.. సౌకర్యవంతంగా ఉంటారా అనే ప్రశ్నలు వినపడుతున్నాయి.
ప్రస్తుత బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షాబుద్దీన్ పదవీకాలం ఏప్రిల్ 2028 వరకు ఉన్నప్పటికీ.. ఆయన ఆ పదవి నుంచి వైదొలిగే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. షేక్ హసీనా అవామీ లీగ్ ప్రభుత్వంలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన షాబుద్దీన్ డిసెంబర్ లో రాయిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, యూనస్ ప్రభుత్వం తనను అవమానించింది అని.. పక్కన పెట్టిందని.. ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల తర్వాత రాజీనామా చేయాలనుకుంటున్నానని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 50 ప్రకారం, అధ్యక్షుడు ఐదు సంవత్సరాల పాటు పని చేస్తారు. పదవీకాలం ముగింపు, రాజీనామా లేదా అభిశంసన కారణంగా ఆ పదవి ఖాళీగా ఉంటే, ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహిస్తుంది. అధ్యక్షుడిని పార్లమెంటు సభ్యులు ఎన్నుకుంటారు.













