హెచ్-1బీ భాగస్వాములకు తాత్కాలిక ఊరట
హెచ్-1బీ వీసాదారుల భాగస్వాములను ఉద్యోగాల నుంచి తొలగించే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ట్రంప్ యంత్రాగం వెల్లడించింది. దీంతో పెద్ద సంఖ్యలో అక్కడ పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులు, వారి కుటుంబాలకు ఊరట లభించినట్లుయ్యింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ( డీహెచ్ఎస్) ప్రకటించింది. హెచ్ 4 వీసాల మీద వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న హెచ్-1బీ వీసా దారుల భాగస్వాములను ఉద్యోగాల నుండి తొలగించే నిర్ణయంపై జూన్ వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోబోం. వాళ్లని తొలగించాలని తీసుకునే నిర్ణయం దేశంపై ఆర్థికంగా ఎటువంటి ప్రభావం చూపుతుందనే దాన్ని పరిశీలించాల్సి ఉంది. అందువల్ల అప్పటి వరకు హెచ్-1బీ భాగస్వాముల ఉద్యోగాలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని డీహెచ్ఎస్ వెల్లడించింది.













