శుభవార్త చెప్పిన యాపిల్
టెక్నాలజీ దిగ్గజం యాపిల్ తన అభిమానులకు శుభవార్త చెప్పింది. కాలిఫోర్నియాలోని శాన్‌జోస్‌లో జరుగుతున్న వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (డబ్ల్యూడబ్ల్యూడీసీ)లో ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఐవోఎస్ 12 ఓఎస్2ను ఆవిష్కరించింది. ఈ ఓఎస్‌తో ఐఫోన్లు, ఐపాడ్లు మరింత సమర్థవంతంగా పనిచేయనున్నాయి. గతంలో లేని సరికొత్త అనుభూతిని ఇది అందిస్తుందని యాపిల్ తెలిపింది. తరచూ వచ్చే నోటిఫికేషన్స్ చిరాకు తెప్పించకుండా డునాట్ డిస్టర్బ్ ఫీచర్‌తోపాటు యాప్‌ల నుంచి వచ్చే నోటిఫికేషన్లను ఒకేసారి క్లియర్ చేసుకునేందుకు గ్రూప్ నోటిఫికేషన్స్ ఫీచర్లను ఇందులో జోడించింది. పర్సనలైజ్డ్ అనిమోజీలు క్రియేట్ చేసుకునేందుకు మెమోజీ అనే మరో ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు యాపిల్ సీనియర్ ప్రెసిడెంట్ క్రైగ్ ఫెడెర్గి తెలిపారు.













