రాష్ట్రాభివృద్ధిలో ‘తానా’ ముందుండాలి… దేవినేని ఉమ
ఆంధ్రప్రదేశ్ రాష్రాభివృద్ధిలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) పాలుపంచుకోవాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కోరారు. చైతన్యస్రవంతిలో భాగంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) విజయవాడలోని లక్కీపేటలోని ఎ కన్వెన్షన్ సెంటర్లో డిసెంబర్ 21వ తేదీన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జన్మభూమి స్ఫూర్తితో ఎన్నో చక్కటిసేవా కార్యక్రమాలను ఎన్నారైలు చేస్తున్నారని తెలిపారు. హుదూద్ తుపాన్ బాధితులకు సాయం చేయడానికి తానా ముందుకురావడం అభినందనీయమన్నారు. నగర మేయర్ కోనేరు శ్రీధర్ మాట్లాడుతూ రాజధాని నిర్మాణంలో ఎన్నారైలు చేయూతనివ్వాలని కోరారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్ళ గుండెల్లో ‘తానా’ చోటు సంపాదించుకుందని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దె అనూరాధ, బాపిరాజు, నాగభూషణం, సిద్దార్థ అకాడమీ చైర్మన్ లక్ష్మణరావు, తానా అధ్యక్షుడు మోహన్ నన్నపనేని, తానా ఉపాధ్యక్షుడు డా. జంపాల చౌదరి, మాజీ అధ్యక్షులు జయరామ్ కోమటి, ప్రసాద్ తోటకూర, తానా ఫౌండేషన్ చైర్మన్ జయశంకర్ తాళ్ళూరి, తానా కార్యదర్శి సతీష్ వేమన, కోశాధికారి మధు తాతా, 20వ మహాసభల కన్వీనర్ నాదెళ్ళ గంగాధర్, లావు అంజయ్య చౌదరి, రజని ఆకురాతి, గౌతమ్‌కుమార్, చలపతిరావు, రావు యలమంచిలి, వాసుదేవరెడ్డి చిన్నా, అశోక్‌బాబు కొల్లా, హేమారావు, శ్రీకాంత్ పోలవరపు, అనిల్ లింగమనేని, సుధీర్, హేమ, రవి పొట్లూరి, వెంకటేష్, వర్థమాన హీరోయిన్ అశ్విని తదితరులు ఈ కార్యక్రమానికి వచ్చారు.













