ఎన్టీఆర్ బయోపిక్ లో శ్రియ ?
బాలకృష్ణ, క్రిష్‌ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ ముగింపు దశకు చేరుకుంటోంది. సంక్రాంతికి ఎన్టీఆర్ కథానాయకుడు విడుదలకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరిలో ఎన్టీఆర్ మహానాయుడు విడుదల కానుందని తెలిసింది. ఈ బయోపిక్ షూటింగ్‌ను డిసెంబర్ రెండు లేదా మూడవ వారం లోపున పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు ఫిల్మ్‌మేకర్స్. ఈ చిత్రంలో ఇప్పటికే ఎంతో మంది స్టార్స్‌ను నటింపచేస్తున్న దర్శకుడు క్రిష్ మరో కీలక పాత్రలో హీరోయిన్ శ్రియాను నటింపచేస్తున్నట్లు తెలిసింది. ఎన్టీఆర్ కెరీర్లో ఎప్పటికీ నిలిచిపోయే దాన వీర శూర కర్ణ చిత్రానికి సంబంధించిన కొన్ని సీన్స్ ఈ బయోపిక్‌లో ఉండబోతున్నాయట. ఈ సన్నివేశాలకు సంబంధించిన కీలక పాత్రలో శ్రియా కనిపించబోతున్నట్లు సమాచారం. దాన వీర శూర కర్ణ ఎపిసోడ్లో శ్రియాతో పాటు నందమూరి కల్యాణ్‌రామ్ కూడా కనిపిస్తాడట. అప్పట్లో హరికృష్ణ దాన వీర శూర కర్ణ చిత్రలో అర్జునుడి పాత్రను పోషించిన విషయం తెలిసిందే. దీంలో కల్యాణ్‌రామ్ అర్జునుడి పాత్రలో కనిపిస్తాడు.













