కిలో మామిడి రూ. 2 లక్షలు…ఎందుకో తెలుసా?

మధ్యప్రదేశ్‍లోని జబల్‍పుర్‍లో సంకల్ప్, రాణి పరిహార్ దంపతులు సాగు చేస్తున్న మామిడి పండ్ల కిలో ధర రికార్డ్ స్థాయిలో సుమారు రూ.2 లక్షల వరకు పలుకుతోంది. జపాన్‍లో ఎక్కువగా పండించే టాయో నో టామ్‍గామ్ రకం మామిడిని సాగు చేస్తూ వారు లాభాలను గడిస్తున్నారు. ఈ రకానికి చెందిన చెట్లు ఒకొక్కదానికి 20 పండ్లు కాస్తాయని, పండు కూడా రుచిగా ఉంటుందని రాణి పరిహార్ తెలిపారు.