కమలా హారిస్ విజయానికి గుర్తుగా…
కమలా హారిస్ ఇప్పుడు అమెరికాతో పాటు ప్రపంచమంతా ఈ పేరు మారుమోగుతోంది. ఇక, భారత్ సంగతి సరే సరి. అమెరికా ఉపాధ్యక్ష పదవి చేపట్టి ఆమె చరిత్ర సృష్టిస్తే.. భారత్‌లోని కమల లు మాత్రం బంఫర్ ఆఫర్ కొట్టేశారు. ఆమె విజయానికి గుర్తుగా, జవనరి 24, 2021 సరదాగా గడిపే అవకాశాన్ని పొందారు. ఇంతకీ విషయం ఏంటంటే.. అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపట్టిన మొదటి మహిళగా కమలా హారిస్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆమె భారత సంతతి మహిళా కూడా. అందుకే వండర్ లా థీమ్ పార్క్ ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంది. దానికి గుర్తుగా కమల పేరుతో ఉన్న వ్యక్తులకు రేపు ఈ పార్క్‌ను ఉచితంగా వీక్షించే అవకాశాన్ని అందించింది. దీనికి సంబంధించిన వివరాలను వండల్ లా ఫేస్బుక్లో పోస్టు చేసింది.
ఈ ఆదివారం కమలలందరి విజయం. జనవరి 24, 2021న కమల పేరుతో ఉన్నవారికి ఉచిత ప్రవేశం ఉంది. వారు చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది. బెంగళూరు, కొచ్చి, హైదరాబాద్‌లోని వండర్ లా థీమ్ పార్కులో ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. kamla, kamal, kamalam సహా కమల పేరుతో సామీప్యత ఉన్న పేరుగల వారు ఈ ప్రత్యేక సదుపాయాన్ని పొందనున్నారు అని ఆ పోస్టులో రాసుకొచ్చింది. అలాగే మొదటి వచ్చిన 100 మంది వీక్షలకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుందని పార్క్ యాజమాన్యం సృష్టం చేసింది.













