ప్రజలు కోరితే రాజకీయాల్లోకి వస్తా…
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ప్రజలు కోరుకుంటే తాను రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లోకి వస్తే తాను ప్రధాన మార్గంలో ప్రజలకు సేవ చేసే అవకాశం లభిస్తుందన్నారు. రాజకీయాలను అర్థం చేసుకుంటున్నానని వెల్లడిరచారు. ఒకవేళ ప్రజలు నేను వారి తరపున ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటే, నేను వారి కోసం కొంత మార్పు తీసుకురాగలనని భావిస్తూ, అప్పుడు కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తా అని తెలిపారు. గత పది సంవత్సరాలకు పైగా తన స్వచ్ఛంద సేవలు కొనసాగుతున్నాయని, భవిష్యత్తులోనూ కొనసాగుతాయని తెలిపారు.













