త్వరలో వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్
వాట్సాప్ యూజర్లు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఓ అదిరిపోయే ఫీచర్ త్వరలోనే రానుంది. ప్రస్తుతం బీటా వెర్షన్లో ఉన్న ఈ ఫీచర్ అతి త్వరలోనే అందరు యూజర్లకు అందుబాటులోకి రానున్నట్లు బీటాఇన్పో తెలిపింది. ఇన్నాళ్లూ మీ లాస్ట్ సీన్, ప్రొఫైల్ పిక్చర్, స్టేటస్లను ఎవరూ చూడాలన్న దాంట్లో మూడు ఆప్షన్సే అందుబాటులో ఉన్నాయన్న విషయం తెలుసు కదా. ఎవరీవన్, మై కాంటాక్టస్, నోబడీ అనే ఆప్షన్స్ ఉన్నాయి. దీని ప్రకారం ఎవరీవన్ అంటే ప్రతి ఒక్కరూ మీ లాస్ట్ సీన్, ప్రొఫైల్ పిక్, స్టేటస్ చూడొచ్చు. అదేమై కాంటాక్టస్ అంటే కేవలం మీ కాంటాక్టస్ మాత్రమే చూస్తారు. నోబడి అంటే ఎవరూ చూడలేరు. కానీ వాట్సాప్ తీసుకొస్తున్న తాజా అప్డేట్ ప్రకారం మీరు మీ కాంటాక్టస్ లోని వాళ్లలో కూడా కొందరు మీ లాస్ట్ సీన్, ప్రోఫైల్ పిక్, స్టేటస్ చూడకూడదనుకుంటే ఆ ప్రకారం సెట్టింగ్స్ మార్చుకోవచ్చు.













