చార్‍ధామ్ యాత్ర మరోసారి… వాయిదా

చార్‍ధామ్ యాత్రను వాయిదా వేస్తున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, తదుపరి విచారణ తర్వాత మరోసారి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఈ మేరకు కరోనా గైడ్‍లైన్స్ను ప్రభుత్వం మరోసారి మార్పు చేసింది. ఈ ఏడాది చార్‍ధామ్ యాత్రకు వ్యతిరేకంగా గతంలో కోర్టు ఆదేశాలున్నప్పటికీ నిర్వహించాలని ఉత్తరాఖండ్ కేబినెట్ నిర్ణయించింది. జులై ఫస్టు నుంచి మొదటి దశలో మూడు జిల్లాలకు, జులై 11 నుంచి రాష్ట్ర ప్రజలకు అనుమతిస్తూ పోయిన నెలలో ఉత్తర్వులిచ్చింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై హైకోర్టు ప్రభుత్వం నిర్ణయంపై స్టే విధించింది.