యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం…
ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరుస పండుగలకు ముందు ఆలయాలు, మసీదుల్లో మైక్‌ల తొలగింపుపై స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఈ నేపథ్యంలో వందలాది మతపరమైన ప్రాంతాల నుంచి లౌడ్స్పీకర్లను తొలగించినట్లు యూపీ పోలీసులు తెలిపారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలతో ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు మత పెద్దలతో సమావేశాలు నిర్వహించడంతో పాటు కరపత్రాల ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెలలో ఈద్, అక్షయ తృతీయ వేడుకలు ఒకే రోజున రానున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ లోని జహంగీర్‌పూర్‌లో హనుమాన్ ర్యాలీ సందర్భంగా జరిగిన ఘర్షణలు వంటివి నివారించేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ గత వారం పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై సమీక్షించారు. ఎలాంటి ఘర్షణలు జరుగకుండా తగిన చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు.













