కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి.. రష్యా ఆహ్వానం
వచ్చే ఏడాది తమ దేశంలో జరగనున్న 4వ లెట్స్ ట్రావెల్ రష్యా టూరిజం ఫోరం సదస్సుకు హాజరు కావాలంటూ భారతదేశ సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డికి రష్యా ప్రభుత్వం ఆహ్వానం పలికింది. రష్యా రాజధాని మాస్కోలో వచ్చే ఏడాది జూన్లో ఈ సదస్సు జరగనుంది. సదస్సులో పాల్గొనాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రష్యా ఆర్థిక శాఖ సహాయ మంత్రి దిమిత్రి వఖ్రుకోవ్ లేఖ రాశారు. భారత్ ` రష్యా మధ్య ఉన్న బలమైన సాంస్కృతిక, పర్యాటక బంధాన్ని గుర్తు చేశారు. పర్యాటక, వ్యాపార రంగాల్లో భారతదేశం సామర్థ్యాన్ని తెలియజేయడానికి ఇదొక మంచి వేదిక అని, అందుకే ఈ కార్యక్రమంలో వ్యక్తిగతంగా పాల్గొనాలని కిసన్ రెడ్డిని ఆయన కోరారు.













