విదేశీ వర్శిటీల తరహాలోనే.. మన దేశంలో కూడా

విదేశీ వర్శిటీల తరహాలోనే విద్యార్థులకు ఏడాదికి రెండు సార్లు అడ్మిషన్లు ఇచ్చేందుకు దేశంలోని యూనివర్శిటీలు, ఉన్నత విద్యాసంస్థలకు అనుమతిస్తామని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజిసి) చైర్మన్ ప్రొఫెసర్ ఎం. జగదీశ్ కుమార్ వెల్లడించారు. ఈ విషయంపై యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రణాళికతో ముందుకు సాగుతోందని తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఏడాది రెండు అడ్మిషన్ సైకిల్స్ ఉంటాయని అన్నారు. జులై, ఆగస్టు, జనవరి, ఫిబ్రవరి మధ్య దేశంలోని యూనివర్శిటీలు, ఉన్నత విద్యా సంస్థల్లో ఏడాదికి రెండు సార్లు అడ్మిషన్లు జరుగుతాయని తెలిపారు.