టెట్ అభ్యర్థులకు కేంద్రం శుభవార్త…

టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) అభ్యర్థులకు కేంద్ర విద్యాశాఖ తీపికబురు అందించింది. టెట్ క్యాలిఫైయింగ్ సర్టిఫికెట్ గడువును 7 సంవత్సరాల నుంచి జీవిత కాలం పొడిగిస్తూ కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియల్ నిశాంక్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‍సీటీఈ) ప్రకారం 2011, ఫిబ్రవరి నుంచి ఈ పెంపును అమలుపరచాలన్నారు. ఇప్పటికే 7 సంవత్సరాల గడువు ముగిసిన అభ్యర్థులకు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా కొత్త సర్టిఫికెట్‍ల జారీలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే గతంలో టెట్‍కు 7 సంత్సరాల అర్హత ఉండేది. అదే విధంగా, ఒక అభ్యర్థి టెట్‍ను ఎన్నిసార్లయినా రాసుకోవచ్చన్న విషయం తెలిసిందే.