బీజేపీ వైపు దాదా అడుగులు?
మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బీజేపీ వైపు అడుగులు వేస్తున్నాడన్న వాదనలు ఊపందుకున్నాయి. కోల్‌కతాలో బడి నిర్మించేందుకు తృణమూల్ కాంగ్రెస్ గతంలో కేటాయించిన రెండు ఎకరాల భూమిని గంగూలీ తిరిగి ఇచ్చేశాడట. ఈ విషయాన్ని ఆ రాష్ట్రానికి చెందిన ఓ మీడియా సంస్థ వెల్లడించింది. వచ్చే ఏడాది బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రంలో బలమైన, విశ్వసనీయమైన వ్యక్తి కోసం బీజేపీ అన్వేషిస్తున్నది. దీంతో క్రికెట్‌తో పాటు వ్యక్తిత్వంపరంగానూ బెంగాలీల ప్రజల మనసుల్లో ఉన్నతంగా ఉన్న గంగూలీ పార్టీలో ఉంటే లాభిస్తుందని కాషాయ దళం అనుకుంటున్నది.













