ఆస్పత్రిలో చేరిన సౌరవ్ గంగూలీ …
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గుండెపోటుకు గురయ్యారు. కోల్కతాలోని వుడ్ల్యాండ్ ఆసుపత్రిలో చేరారు. ఛాతిలో నొప్పి కారణంగానే ఆయన ఆసుపత్రిలో చేరినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం దాదా ఆరోగ్యం నిలకడగానే ఉందని అన్నారు. తన ఇంట్లోని జిమ్లో వ్యాయామం చేస్తుండగా అసౌకర్యంగా ఫీలయ్యాడు. విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపారు. గుండెలో నొప్పిగా ఉన్నదంటూ గంగూలీ ఫిర్యాదు చేశారు. ఆయన ఇబ్బంది పడటంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం గుంగూలీ ఆరోగ్యం నిలకడగానే ఉంది. గుండెకు సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా లేదా అని పరిశీలిస్తున్నాం. ఆయనకు కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంది అని వైద్యులు తెలిపారు.













