సోనూసూద్ సోదరి ఓటమి
పంజాబ్ ఎన్నికల్లో సినీ నటుడు సోనూ సూద్ సోదరి మాల్విక సూద్ ఓటమి చెందారు. ఆమె మోగా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలిచారు. గత 40 సంవత్సరాల్లో ఈ స్థానం కాంగ్రెస్‌దే పైచేయిగా ఉంటోంది. 2017 ఎన్నికల్లో ఇక్కడ హర్జోత్ సింగ్ గెలిచాడు. బలమైన కాంగ్రెస్ స్థానాలు ఆప్ కైవసం కావడంతో ఆ పార్టీ ఘన విజయం సుస్పష్టం అయింది. మోగా కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంటూ వచ్చింది. సోనూ సూద్ సోదరి కావడంతో ఈ స్థానానికి మరింత ప్రాధాన్యత పెరిగింది. అయితే సోదరి సూద్‌ను ఇక్కడ ఆఫ్ అభ్యర్థి డాక్టర్ అమన్‌దీప్ కౌర్ అరోరా అవలీలగానే ఓడించారు.













