మరోసారి విపక్షాల భేటీ.. ఎప్పుడంటే
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ఉన్న విపక్ష పార్టీలన్నీ ముందుకు కదులుతున్నాయి. దీనిలో భాగంగా ఆరు రోజుల క్రితం బిహార్లోని పట్నాలో విపక్షాలు సమావేశమయ్యాయి. తాజాగా తమ మధ్య మరోసారి సమావేశం జరుగుతుందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వెల్లడించారు. బెంగళూరులో జులై 13`14న ఈ భేటీ జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ నేతలు, పాలనపై విమర్శలు చేశారు. పట్నా సమావేశం తర్వాత ప్రధాని మోదీ అశాంతికి గురయ్యారని వ్యాఖ్యానించారు. ఈశాన్య రాష్ట్రం మణిపుర్ మండిపోతున్నా అక్కడి సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ అనవసర వ్యాఖ్యలు చేయకుండా మహిళల భద్రతపై దృష్టి సారించాలని సూచించారు.













