భారత సంతతి శాస్త్రవేత్తలకు వైభవ్ ఫెలోషిప్
భారత మూలాలున్న 22 మంది శాస్త్రవేత్తలకు వైభవ్ ఫెలోషిప్లను మంజూరు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికింద వారు భారత్‌లోని అగ్రశ్రేణి సాంకేతిక సంస్థల్లో సంయుక్త పరిశోధనలు చేపడతారు. కృత్రిమ మేధ (ఏఐ), క్వాంటమ్ టెక్నాలజీ వంటి ఆధునాతన రంగాల్లో ఇవి జరుగుతాయి. బాంబే, కాన్పుర్ ఐఐటీల్లో ఎలక్ట్రిక్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ రంగాల్లో భాగస్వామ్య ప్రాజెక్టులు చేపట్టేందుకు అగ్రశ్రేణి శాస్త్రవేత్తలు ఆరోగ్యస్వామి జె పాల్‌రాజ్, ప్రొఫెసర్ జితేంద్ర మాలిక్‌లను డిస్టింగ్విష్డ్ వైభవ్ ఫెలోస్ గా ఎంపిక చేసింది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్రసింగ్ ఈ ప్రకటన చేశారు. వైభవ్ ఫెలోషిప్ పొందిన దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన మురళీ అన్నవరం ఏఐ, మెషీన్ లెర్నింగ్‌పై బెంగళూరులోని ఐఐఎస్సీ శాస్త్రవేత్తలతో కలిసి పనిచేస్తారు.













