జైలు నుంచి శశికళ విడుదల
అన్నాడీఎంకే బహిష్కృత నేత, తమిళనాడు మాజీ సీఎం జయలలిత స్నేహితురాలు వీకే శశికళ జైలు నుంచి విడుదలయ్యారు. అవినీతి కేసులో ఈమె నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించారు. కరోనా బారిన పడ్డ శశికళ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శశికళ విడుదలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను అధికారులు ఆస్పత్రిలోనే పూర్తి చేశారు. మరో 10 రోజుల పాటుఆమె ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు తెలిపారు. జనవరి 20న శశికళకు కరోనా సోకింది. ప్రస్తుతం విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రి వర్గాలతో చర్చించి డిశ్చార్జిపై నిర్ణయం తీసుకుంటామని శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ తెలిపారు. ప్రస్తుతం శశికళ ఆరోగ్యం మెరుగ్గానే ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కరోనా లక్షణాలు ఏవీ లేవని వెల్లడించారు.













