శశికళ విడుదల ఎప్పుడంటే…
బెంగుళూరు జైలు నుంచి ఈ నెల 27న శశికళ విడుదల కానున్నారని ఆమె తరపు న్యాయవాది మద్రాసు హైకోర్టుకు తెలియజేశారు. 1994-95లో దాఖలు చేసిన ఆదాయపన్ను వివరాల్లో రూ.4 లక్షలు తక్కువగా కట్టారని శశికళపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణ మద్రాసు హైకోర్టులో జరుగుతుంగా, మళ్లీ విచారణకు వచ్చింది. అప్పుడు, ఈ నెల 27న శశికళ బెంగుళూరు జైలు నుంచి విడుదల కానున్నారని, ఈ కేసులో ఆమె తరపు వాదనలు సమర్పించేందుకు అవకాశం కావాలని ఆమె తరపు న్యాయవాది న్యాయమూర్తులకు విజ్ఞప్తి చేశారు. శశికళ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం, తదుపరి విచారణను ఫిబ్రవరి 4వ తేదీకి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.













