శంకర్ నేత్రాలయ వ్యవస్థాపకుడు ఎస్ఎస్ బద్రీనాథ్ కన్నుమూత
శంకర నేత్రాలయ వ్యవస్థాపకుడు, ప్రముఖ విట్రియోరెటినల్ సర్జన్ ఎస్ఎస్ బద్రీనాథ్ కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బద్రీనాథ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు(నవంబర్ 21) తుదిశ్వాస విడిచారు. వైద్య రంగంలో ఆయన చేసిన కృషికిగానూ 1996లో భారత ప్రభుత్వం బద్రీనాథ్ ను పద్మభూషన్ అవార్డుతో సత్కరించింది. విదేశాలలో విద్యనభ్యసించిన బద్రీనాథ్ అనేక అధ్యయనాలు పరిశోధనలను పూర్తి చేసి భారత్ కు వచ్చిన తర్వాత 1978లో చెన్నైలో ఈ కంటి ఆసుపత్రిని స్థాపించారు. చాలాకాలంపాటు దీనికి ఛైర్మన్ గా వ్యవహరించారు.













