రాబర్ట్ వాద్రా సంచలన ప్రకటన… బీజేపీపై
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా భర్త రాబర్ట్ వాద్రా సంచలన ప్రకటన చేశారు. రాజకీయ రంగ ప్రవేశం చేసి, ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటానని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తేదీ సమీపిస్తున్న తరుణంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. బీజేపీపై పోరాటం చేయడానికి తాను రాజకీయాల్లోకి రావడమే మార్గమని తెలిపారు. వ్యాపారవేత్త అయిన రాబర్ట్ వాద్రా ప్రస్తుతం పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. పార్లమెంటు సభ్యుడినయితే ప్రజలకు సంక్షేమానికి ఇంకెంతో చేయవచ్చన్న ఉద్ధేశంతోనే రాజకీయాల్లోకి రావాలని అనుకుంట్టున్నట్లు తెలిపారు.













