అత్యున్నత పదవిలో తెలుగుతేజం
కేంద్ర రవాణా, జాతీయ, రహదారుల మంత్రిత్వ శాఖ అత్యున్నత పదవిలో తెలుగు అధికారి నియమితులయ్యారు. ఈ మేరకు మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్, ప్రత్యేక కార్యదర్శిగా పీవీవీఎస్‌ఎస్ రవిప్రసాద్ ఢిల్లీలో బాధ్యతలు చేపట్టారు. ఈ అత్యున్నత పదవిలో తెలుగు వ్యక్తి నియమితులు కావడం ఇదే తొలిసారి. 1988 సెంట్రల్ ఇంజినీరింగ్ సర్వీసెస్‌కు చెందిన ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలోని గొల్లలకోడేరులో జన్మించారు.
గతంలో తెలంగాణ చీఫ్ ఇంజీనిర్, రీజనల్ మేనేజర్‌గా పని చేశారు. ఆయన సతీమణి స్వస్థలం తెలంగాణలోని మంథని. తాడికొండ రెసిడెన్సియల్ పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన రవిప్రసాద్ రూర్కీ ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీ చేయడమే కాకుండా బంగారు పతకాన్ని సాధించారు. గత రెండేళ్లుగా ఢిల్లీలో అదనపు డైరెక్టర్ కాకుండా బంగారు పతకాన్ని సాధించారు. గత రెండేళ్లుగా ఢిల్లీలో అదనపు డైరెక్టర్ జనరల్‌గా పని చేస్తున్నారు.













