రతన్‌టాటాకు అసోచామ్ సెంటినరీ అవార్డు
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌టాటాకు అసోచామ్ సెంటినరీ అవార్డును ప్రధాని నరేంద్ర మోదీ అందజేశారు. అసోచామ్ ఫౌండేషన్ వీక్-2020 వర్చువల్ విధానంలో జరగ్గా.. ప్రధాని నరేంద్ర మోదీ కీలకోపన్యాసం చేశారు. గత వంద సంవత్సరాల్లో భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, సాధారణ భారతీయుడికి సహాయం చేయడానికి అసోమ్ టాటా గ్రూప్ చాలా కష్టపడ్డాయి. రతన్ టాటా దేశానికి చేసిన విశేష కృషికి గౌరవం లభించిందని ప్రధాని మోదీ అన్నారు. పాలస్తినా సహా ఈ ప్రాంతంలో స్థిరత్వం, శాంతికి మద్దతు ఇచ్చే ఆవిష్కరణలను ప్రోత్సహించినందుకు టాటాను త్వరలో ఇండో- ఇజ్రాయెల్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ సత్కరించనుంది. డిసెంబర్ 21న దుబాయ్‌లో ఫెడరేషన్ ఆఫ్ ఇండో-ఇజ్రాయెల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంతర్జాతీయ చాప్టర్‌ను ప్రారంభించిన సందర్భంగా టాటా గ్రూప్ చైర్మన్‌ను గ్లోబల్ విజనరీ ఆఫ్ సస్టెయినరీ ఆఫ్ సస్టెయినబుల్ బిజినెస్ అండ్ పీస్ తో అవార్డుతో సత్కరించనున్నారు.
ఈ సందర్భంగా తాను వ్యాపారంలో ఉన్న అన్ని సంవత్సరాల్లోనూ దేశ ప్రధాని ఏం చేయాలనుకున్నారో అది విలువైనదిగా భావించానని టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్‌టాటా అన్నారు. మహమ్మారి సమయంలో దేశాన్ని నడిపించారని ప్రధానిని కొనియాడారు. ఈ సమావేశంలో హిరానందని గ్రూప్ హెడ్ నిరంజన్ హిరానందని పాల్గొన్నారు.













