భారత్ బయోటెక్ సీఎండీకి విశిష్ట పురస్కారం
2021 సంవత్సరానికి గాను డాక్టర్ రామినేని ఫౌండేషన్ పురస్కారాలు ప్రకటించారు. భారత్ బయెటెక్ సీఎండీ డా.కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్లకు విశిష్ట పురస్కారం లభించింది. ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం, నిమ్స్ ప్రొఫెసర్ డా.దుర్గా పద్మజ, ప్రముఖ సినీ పాత్రికేయుడు ఎస్.వి.రామారావులకు రామినేని ఫౌండేషన్ విశేష పురస్కారం దక్కింది. త్వరలో ఈ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు రామినేని ఫౌండేషన్ కన్వీనర్ పాతూరి నాగభూషణం తెలిపారు. రామినేని ఫౌండేషన్ 2020 అవార్డులను గతంలో ప్రకటించామని తెలిపారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో అవార్డుల ప్రదానోత్సవం జరగలేదని తెలిపారు. ఈ సారి ఒకే వేదికపై రెండు సంవత్సరాలకు సంబంధించిన పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.













