రాందేవ్ బాబా యూటర్న్…

ఆయుర్వేదం, యోగాసనాలతో కరోనాను జయిస్తానని ఇప్పటివరకు చెప్పుకొచ్చిన యోగా గురువు బాబా రాందేవ్ స్వరం మార్చారు. కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోనున్నట్టు ప్రకటించారు. అలాగే, కరోనా పోరులో ముందుండి సేవలు అందిస్తున్న వైద్యులను భూమి పైకి వచ్చిన దేవుడి దూతలుగా అభివర్ణించారు. కాగా, కరోనా చికిత్సకు అల్లోపతి వైద్యం పనిచేయదని రాందేవ్ చేసిన ఇటీవలి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపడం తెలిసిందే.