ఎక్కడ దాకున్నా.. వారిని వేటాడతాం : రాజ్నాథ్ సింగ్
భారత్కు వస్తోన్న వాణిజ్య నౌకల పై ఇటీవల జరిగిన దాడులను కేంద్రం తీవ్రంగా పరిగణించినట్లు రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యుద్ధనౌక ఐఎన్ఎస్ ఇంపాల్ను ముంబయి వేదికగా నౌకదళంలో ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. నౌకలపై వరుస దాడుల నేపథ్యంలో సముద్ర జలాల్లో గస్తీని ముమ్మరం చేసినట్లు వెల్లడిరచారు. ఈ దాడులకు పాల్పడిన వారు సముద్రంలో ఎక్కడ దాక్కున్నా వేటాడి, పట్టుకుంటామని స్పష్టం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.













