ఏకంగా మూడు గంటల పాటు ప్రధాని నివాసం ముందు రాహుల్ మెరుపు ధర్నా
కాంగ్రెస్ ఎంపీలు రాహుల్, ప్రియాంక ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ అధికార నివాసం ముందే మెరుపు ధర్నాకు దిగడం తీవ్ర చర్చనీయాంశమైంది. అలాగే అందరి దృష్టినీ ఆకర్షించింది. జంతర్‌మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌కు నిరసనగా ఈ మెరుపు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖార్గేతో పాటు కాంగ్రెస్ ఎంపీలు కూడా పాల్గొన్నారు.కాంగ్రెస్ నేతలు చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన తెలిపారు.
దీంతో సర్కార్ అలర్ట్ అయ్యింది. కేబినెట్ లో అత్యంత సౌమ్యుడు, వివాదరహితుడైన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ను రాహుల్ టీమ్ దగ్గరికి కేంద్రం పంపింది. ఆయన రాహుల్ గాంధీతో కాసేపు మాట్లాడారు. ధర్నా విరమించాలని కోరారు.దీనికి రాహుల్ ససేమిరా అంగీకరించలేదు.రాహుల్‌కు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఆందోళన విరమించాలని కోరారు.
మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్‌పై పార్లమెంట్లో చర్చకు సంబంధించిన విషయంలో రాహుల్ మాట తప్పారంటూ మండిపడ్డారు. రాహుల్ మాట తప్పడం.. కొత్తగా రెండు డిమాండ్లు పెట్టడం సరికాదని అన్నారు.
‘హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్‌తో కలిసి చర్చలు జరిపాం. నీట్‌పై పార్లమెంట్లో చర్చించాలని రాహుల్ డిమాండ్ చేశారు. చర్చకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించింది. మొదట అంగీకరించి రాహుల్ మాట తప్పారు. మళ్లీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతున్నారు. కొత్తగా రెండు డిమాండ్లు పెట్టడం.. మాట తప్పడం సరికాదు’ అని పేర్కొన్నారు.
ఇక.. దాదాపు మూడు గంటల పాటు ఈ మెరుపు ధర్నా కొనసాగింది. చివరికి పోలీసులు ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. రాహుల్, ప్రియాంకతో సహ కాంగ్రెస్ ఎంపీలందర్నీ అదుపులోకి తీసుకున్నారు. బస్సుల్లో తరలించారు. ఈ సందర్భంలోనే రాహుల్ గాంధీకి చిన్న గాయమైంది.
రాహుల్, ప్రియాంక ను వేర్వేరు పీఎస్ లకు తరలించిన పోలీసులు
రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని పోలీసులు వేర్వేరు పీఎస్ లకు తరలించారు. ఈ క్రమంలో మందిర్ మార్క్ పీఎస్ లో వున్న ప్రియాంకను కలిసేందుకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా అక్కడికి వెళ్లారు. తొలుత లోపలికి పంపేందుకు అనుమతించలేదు. ఆ తర్వాత పోలీసులు అనుమతి ఇచ్చారు. మరో వైపు రాహుల్ గాంధీని మోడల్ టౌన్ లోని ఛత్రసాల్ స్టేడియానికి తరలించారు.








