కరోనా ప్రభావం తగ్గింది… అయినా వ్యాక్సినేషన్ వేగవంతం కావాలి : రాహుల్
వైరస్ మధ్యే అందరమూ బతుకుతున్నామని, దేశ ప్రజలందరూ త్వరగా వ్యాక్సిన్ తీసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అభ్యర్థించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. దేశంలో ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలని, ఎవరికి ఇబ్బందులు ఏర్పడ్డా, ఏ ఒక్కరూ క్షేమంగా ఉన్నట్లు కాదని వ్యాఖ్యానించారు. అయితే దేశంలో ప్రస్తుతం అన్లాక్ ప్రక్రియ సాగుతోందని, ప్రభావం తగ్గిందని, అయినా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావాలని కాంక్షించారు. రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అవసరాల రీత్యా డోసులను పంపిణీ చేయడంలో కేంద్ర విఫలమైందని, మోదీ విధానాల వల్లే వ్యాక్సిన్ కొరత ఏర్పడిందని రాహుల్ దుయ్యబట్టారు. ఇంతటి క్లిష్ట సమయంలో మోదీ ఇమేజ్ను కాపాడడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారని, ఈ ప్రయత్నాలన్నీ వైరస్ వ్యాప్తిని పెంచడానికే దోహదపడుతున్నాయని రాహుల్ ట్వీట్ చేశారు.













