జగన్నాధుని దర్శనానికి రావచ్చు
కరోనా మహమ్మారి నేపథ్యంలో తొమ్మిది నెలల విరామం అనంతరం పూరీలోని జగన్నాథ్ ఆలయం భక్తుల సందర్శనార్థం బుధవారం తిరిగి తెరుచుకుంది. భక్తుల మతసంబంధ విశ్వాసాల నేపథ్యంలో కొవిడ్-19 నియమాలను పాటిస్తూ ఆలయాన్ని తెరిచినట్లు నిర్వాహకులు తెలిపారు. తొలుత కొన్ని రోజులపాటు పూరీ స్థానికులకే దర్శనం సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని అధిక సంఖ్యలో వచ్చే రష్ను దృష్టిలో ఉంచుకుని జనవరి 1, 2 వ తేదీల్లో ఆలయాన్ని మూసివేస్తున్నట్లు వెల్లడించారు. జనవరి 3వ తేదీ నుంచి భక్తులందరిని దర్శనానికి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. భక్తులు కొవిడ్ నిబంధనలకు కచ్చితంగా పాటిస్తూ ఆలయానికి విచ్చేయవలసిందిగా పేర్కొన్నారు.













