అమెరికాలో పంజాబ్ సీఎం కుమార్తెకు బెదిరింపులు
అమెరికాలో ఉన్న పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కుమార్తెను చంపుతామంటూ బెదిరింపులు వస్తున్నాయని, ఆమెను రక్షించాల్సిందిగా ఆందోళన వ్యక్తం చేస్తూ ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ అమెరికాలోని భారత రాయబార కార్యాలయానికి ట్విట్ ద్వారా విజ్ఞప్తి చేశారు. సీఎం కుమార్తెకు ఖలిస్తాన్ అనుకూల వర్గాల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినట్టు సమాచారం. చంపుతామని బెదిరింపులు రావడం అత్యంత పరికిపంద చర్య. ఆమెకు భద్రత కల్పించాలని మలివాల్ కోరారు. ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న సీఎం భగవంత్ మాన్ మాజీ భార్య ఇందర్ ప్రీత్ కౌర్ గ్రెవాల్, 21 ఏళ్ల కుమార్తె సీరత్ కౌర్, 18 ఏళ్ల కుమారుడు దిల్షాన్ ఈ సంఘటనను ధృవీకరించారు. ఖలిస్తాన్ మద్దతుదారులు తన కుతురిని చంపేస్తామని ఫోన్లో బెదిరించారని, తనను దుర్భాషలాడారని ఆమె ఫేస్బుక్లో పోస్టు చేశారు. పసివాళ్లను బెదిరిండం ద్వారా మీరు ఇలా ఖలిస్థాన్ను సాధించబోతున్నారా, అలాంటి వ్యక్తులు సిక్కు మతానికి మచ్చ అని ఆమె పేర్కొన్నారు.













