పెళ్లి పీటలు ఎక్కనున్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(49) పెళ్లి పీటలు ఎక్కనున్నారు. డాక్టర్ గురుప్రీత్ కౌర్ అనే యువతితో ఆయన వివాహం గురువారం ఛండీగడ్‌లో అతి తక్కువ మంది సభ్యుల మధ్య జరగనుందని తెలుస్తోంది. వధువు ఫ్యామిలీ ఫ్రెండ్ అని, చాలా ఏళ్ల నుంచి వీళ్లద్దరికీ పరిచయం ఉందని తెలుస్తోంది. ఆప్ జాతీయ కన్వీనర్, ఢల్లీి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు ఆప్ నేతలు, పంజాబ్ రాజకీయ ప్రముఖులు ఈ వివాహ వేడుక హాజరుకానున్నట్లు తెలుస్తోంది. సీఎం భగవంత్ మాన్‌కి ఇది రెండో వివాహం. గతంలో ఆయనకు ఇంద్రప్రీత్ కౌర్‌తో వివాహం జరిగినప్పటికీ ఆరేళ్ల కిందట ఆయన విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత ఇంద్రప్రీత్ కౌర్ తన ఇద్దరు పిల్లలతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు. అయితే సీఎం భగవంత్ మాన్ తల్లి, సోదరి కోరిక మేరకు ఆయన గురుప్రీత్ కౌర్‌ను వివాహం చేసుకొనేందుకు అంగీకరించినట్లు సమాచారం.













