ఎన్నికల పర్యటన రద్దు…స్వీయ నిర్బంధంలోకి ప్రియాంక!
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. తన భర్త రాబర్ట్ వాద్రాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అసోం ఎన్నికల పర్యటనను ఆమె రద్దు చేసుకున్నారు. నిన్న కొవిడ్ పరీక్షలు చేయించుకోగా తనకు నెగెటివ్ వచ్చిందని ప్రియాంక వెల్లడించారు. కానీ, వైద్యుల సలహా మేరకు కొన్ని రోజుల పాటు ఐసోలేషన్‌లో వెళ్తున్నానంటూ ట్విటర్లో పోస్ట్ చేసిన ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరిస్తున్న ప్రియాంక గాంధీ అసోం, తమిళనాడు, కేరళలో పర్యటించాల్సి ఉంది. అయితే కొవిడ్ కలకలం నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి రాలేకపోతున్నందుకున ప్రతి ఒక్కరినీ క్షమాపణ కోరుతున్నానన్నారు. కాంగ్రెస్ గెలుపు కోసం ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.













