భారత చరిత్రలో ఇదొక అత్యంత అరుదైన సంఘటన : రాష్ట్రపతి
చంద్రుని దక్షిణధ్రువంపైకి విజయవంతంగా చంద్రయాన్-3 నిర్వహించిన ఇస్రో శాస్త్రవేత్తలు అభినందనీయులని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. భారత చరిత్రలో ఇదొక అత్యంత అరుదైన సంఘటన అని భారత శాస్త్రవేత్తలు అపూర్వవిజయం సాధించారని రాష్ట్రపతి అభినందించారు. జీవితకాలంలో ఒకేసారి ఇలాంటి అరుదైన విజయాలు చోటుచేసుకుంటాయని అన్నారు. చంద్రయాన్ -3 విజయం యావత్ భారత దేశానికి గర్వకారణం అని పేర్కొన్నారు. చంద్రుని దక్షిణ ధృవంపైకి విక్రమ్ లాండర్ విజయవంతంగా దిగిన సంఘటనను ప్రత్యక్ష ప్రసారంలో చూసిన ఆమె ఇస్రో శాస్త్రవేత్తలు, ఈ చంద్రయాన్‌తో అనుబంధం ఉన్న అందరినీ కొనియాడారు.













