రేటింగ్ తగ్గినా… ప్రజాదరణలో మోదీనే టాప్

భారత ప్రధాని నరేంద్ర మోదీని ప్రజలు ఆమోదించే రేటింగ్ దగ్గిందని మార్నింగ్ కన్సల్ట్ అనే సర్వే సంస్థ తెలిపింది. ప్రపంచ నాయకులను ప్రజలు ఎంత మేరకు ఆమోదిస్తున్నారనే అంశంపై అమెరికా డేటా ఇంటెలిజెన్స్ సంస్థ అయిన మార్నింగ్ కన్సల్ట్ పలు దేశాధినేతలపై సర్వే నిర్వహించి వివరాలను వెల్లడిస్తూ ఉంటుంది. తాజాగా ఆ సంస్థ జరిపిన సర్వే వివరాల మేరకు.. ప్రధాని మోదీని 66 శాతం ప్రజలు మాత్రమే ఆమోదిస్తున్నారని తెలిపింది. 2019 ఆగస్టులో నిర్వహించిన సర్వేలో మోదీని 82 శాతం మంది ఆమోదించారని, ఇప్పుడు సుమారు 20 పాయింట్లు తగి అది 66 శాతానికి పడిపోయిందని తెలిపింది. అయినా సరే, ఇతర ప్రపంచ నాయకులకంటే ప్రజామోదం ఉన్ననేతగా మోదీనే ముందున్నారు. అయితే, 2021 జూన్ నాటికి ఆ రేటింగ్ 66 శాతానికి పడిపోయిందని తెలిపింది. ఆయనను వ్యతిరేకించే వారిశాతం 28 శాతానికి పెరిగిందని వెల్లడించింది.
భారత్‍ను కరోనా రెండో దశ అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి నివారణలో కేంద్రం చేతులెత్తేసింది. దీంతో ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ కొరత, అధికారుల నిర్లక్ష్యం కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వైద్య వ్వస్థలో లోపాలు బయటపడ్డాయి. మరోపక్క టీకా కార్యక్రమంలో ఆశించిన వేగం కనిపించలేదు. తదితర కారణాలతో ప్రభుత్వం విమర్శల పాలైంది. దీంతో మోదీ ప్రజాదరణ రేటింగ్ పడిపోవడానికి పైవాటితో మరికొన్ని లోపాలుగా చెప్పొచ్చు.