ప్రధాని మోదీతో జో బైడెన్ భేటీ .. భారత్-అమెరికా బంధం ఇకపై
భారత్-అమెరికా మధ్యనున్న స్నేహబంధం ఇకపై ప్రపంచ మానవాళికి మేలు చేయడంలో గొప్ప భూమిక పోషిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జీ20 కూటమి శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన జో బైడెన్‌తో మోదీ తన నివాసంలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. బైడెన్‌కు మా నివాసంలో స్వాగతం పకలడం ఎంతో ఆనందదాయకం. అత్యంత ఫలప్రదంగా మా భేటీ జరిగింది అని ప్రధాని తెలిపారు. భేటీ అనంతరం నేతల సంయుక్త ప్రకటన విడుదలైంది. జీ20కి భారత్ సారథ్యం, అణు ఇంధన రంగ సహకారం, 6జీ/ కృత్రిమ మేధ వంటి అధునాతన సాంకేతికతలు, అంతర్జాతీయ బ్యాంకుల పునర్నిర్మాణం వంటి అంశాలు వీరిమద్ద చర్చకు వచ్చాయి. తమ దేశానికి చెందిన జనరల్ ఆటోమిక్స్ నుంచి ఎంక్యూ-9బీ రకం డ్రోన్లు 31 కొనుగోలు చేసేందుకు భారత రక్షణశాఖ లేఖ అందజేయడాన్ని బైడెన్ స్వాగతించారు. జీ20 కూటమి ముఖ్యమైన ఫలితాలను ఇవ్వడంలో భారత్ సారథ్యం దోహదపడుతోందని ప్రశంసించారు. 2028-29లో ఐరాస భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యతం కోసం మద్దతు ఇస్తామని ప్రకటించారు.













