కొత్త టీమ్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు కొత్త జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆంధప్రదేశ్‌కు చెందిన పురందేశ్వరిని నడ్డా తన టీమ్‌లోకి తీసుకున్నారు. అలాగే జాతీయ ఉపాధ్యక్షురాలిగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన డీకే అరుణకు బాధ్యతలు అప్పగించారు. ఇక యువ మోర్చా అధ్యక్షుడిగా ఎంపీ తేజస్వీ సూర్యకు ప్రమోషన్ లభించింది. ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ను నియమించారు. కొత్తగా నియమితులైన జాతీయ కార్యవర్గానికి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త టీమ్‌కు శుభాకాంక్షలు. పార్టీ సంప్రదాయాన్ని మోస్తూనే.. దేశ ప్రజలకు నిస్వార్థంగా, అంకితభావంతో సేవ చేస్తారని ధీమాగా ప్రకటిస్తూ. పేదలు, అట్టడుగు వర్గాల కోసం కష్టపడి పనిచేస్తారు అని మోదీ ట్వీట్ చేశారు.













